ప్రేమ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తుంది
ఆఫ్రికాలోని కామెరూన్‌కు చెందిన కబుయిన్ జోషువా నన్ను మత్తయి 5:17-20 గురించి బోధించమని అడిగాడు. యేసు మనకు చెబుతున్నది ఇదే అని నేను నమ్ముతున్నాను.
పాత నిబంధనలో దేవుడు మానవాళికి దేవునిపై విశ్వాసం ఉంచడం ఎలాగో నేర్చుకోవడానికి కొన్ని చట్టాలు, ఆజ్ఞలు మరియు నియమాలు ద్వారా జీవించడానికి ఒక మార్గాన్ని ఇస్తున్నాడు! కానీ ఈ పాత నిబంధన లో చెప్పిన ప్రవచనాలన్నీ యేసు ప్రపంచానికి తీసుకువచ్చిన రక్షణ గురించి. మరియు దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడం ద్వారా మన హృదయం లో యేసు క్రీస్తు నివసిస్తారని మరియు మనం పరిశుద్ధ దేవుడు నివసించే ఒక ఆలయంగా మారతాము. యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకానికి రావడం ద్వారా ఈ రక్షణను మన విశ్వాసం ద్వారా పొందుకొనగలము.
మీరు పది ఆజ్ఞలను చదివేటప్పుడు అందులో మొదటి ఆజ్ఞగా చెప్పిన మీ దేవుడైన ప్రభువును ప్రేమించడం అన్న ఆజ్ఞకు విశ్వాసంతో లోబడడం ప్రారంభించిన తరువాత మీరు విశ్వాసంలో ఎదుగుతూ ఆయన కోసం ఎలా జీవించాలి అనే విషయాన్ని తెలుసు కొన్న తరువాత ఇతరులతో ప్రేమగా ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు కూడా తెలుసు కుంటారు!❤️!
కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని రద్దు చేయలేదు, కానీ ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు. ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడం ద్వారా మరియు రక్షణ మరియు పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ మనల్ని నడిపించడం ద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చు చున్నాము. దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం మరియు ఆజ్ఞలు యేసు క్రీస్తు యొక్క ప్రేమ ద్వారా నెరవేర్చారు.
ఒక ముఖ్యమైన మార్గదర్శకాన్ని మనలో ప్రతి ఒక్కరి కోసం 19వ వచనం లో చెప్పారు, మన చుట్టూ ఉన్న ప్రజలు మనలను చూచి మనలను మెచ్చుకోవాలని మనలను చప్పట్లు కొట్టి ప్రశంసిస్తారు అని మనం క్రీస్తును అనుసరించడం లేదు! మనలను మనం మహిమ పరచు కోవడం కోసం మనం దేవుని పనిచేయము. మనం ప్రభువు మహిమ కోసం మాత్రమే పనిచేస్తాము!
"ఈ ఆజ్ఞలను ఆచరించి నడుచు కొనే వారు మరియు వాటిని బోధించే వారందరూ పరలోక రాజ్యంలో గొప్పవారని పిలువబడతారు”
యేసు క్రీస్తే స్వయంగా నేటి క్రైస్తవ సంఘాల లో ఉన్న పరిస్థితిని 20వ వచనంలో చాలా వివరంగ తెలియ చేసారు! "శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను."
నేటి క్రైస్తవ సంఘాలు మనల్ని దేవుని కన్నా ముఖ్యమైనవారిగా చేయడానికి, మనలో గర్వాన్ని అహాన్ని పెంచడానికి మరియు యేసు క్రీస్తు ప్రభువును పక్కకు నెట్టడానికి కోరుకునే విధంగా నేటి క్రైస్తవ మత నాయకులు సంఘాలలో వాక్యానుసారము గాని సంప్రదాయాలను స్థాపించిరి…….మీరందరూ ప్రభువుకు సంపూర్ణముగా సమర్పించు కొనవలసిన అవసరం లేదు, మీరు ప్రభువుకు లోబడి ఉండవలసిన అవసరం కూడా లేదు! మా సంఘములో మేము బోధించిన ఆజ్ఞల ప్రకారం చెప్పినట్లు మీరు చేస్తే చాలు అని తప్పుడు బోధను చెప్పుచున్నారు.
దీనిని బట్టి ప్రజలు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు కానీ నూతన జన్మ అనుభవము లోనికి ప్రవేశించకుండా వ్యర్ధం అయి పోవుచున్నారు."కాగా ఎవడైను క్రీస్తు నందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను;" అయితే ఈ తప్పుడు బోధల వలన వారు క్రీస్తులో ఉన్న నిజమైన ఆనందం, శాంతి మరియు పరిపూర్ణతను కోల్పోతున్నారు.
బ్రదర్ స్టీవెన్, అమెరికా
pursuingjesusinc.blogspot.com
Weekly Devotional
By Max Lucado
Dependable people are like diamonds. They are precious because they are so rare. Experience and know-how are great assets, but they are not much good without trustworthiness. Talent is wonderful, but by itself its not enough. Far better to be a faithful christian. Are you? Like Timothy and Epaphroditus , are you a role model for others? Determine to be a person others can rely on. Keep your word. Show up. Be consistent. Live for others. Take risks . Be a "go to" guy or gal. Make it your goal, by God's grace, to exemplify a life of spiritual steadiness.
Dependable people are like diamonds. They are precious because they are so rare. Experience and know-how are great assets, but they are not much good without trustworthiness. Talent is wonderful, but by itself its not enough. Far better to be a faithful christian. Are you? Like Timothy and Epaphroditus , are you a role model for others? Determine to be a person others can rely on. Keep your word. Show up. Be consistent. Live for others. Take risks . Be a "go to" guy or gal. Make it your goal, by God's grace, to exemplify a life of spiritual steadiness.
ప్రేమ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తుంది
Subscribe to:
Posts (Atom)
6 comments:
ఆమేన్ హల్లెలూయ దేవునికి స్తోత్రం 🙌
ఆవును నిజమే అయ్యగారు
ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక 🙏
ప్రైస్ లార్డ్ అన్న ఈరోజు వాక్యం చదివాము అన్న చాలా బాగుంది అన్నా ఈరోజు వాక్యం దేవుడు దేవుడు మాతో మాట్లాడినట్టు అనిపించింది అన్నా నేటి క్రైస్తవులంతా అలాగే ఉన్నారు శాస్త్రులాగా పరిసయ్యులు లాగే ఉన్నారు మనము అలా ఉండకూడదు దేవునిలో పరిపూర్ణంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆమెన్🙏
Amen
హల్లెలూయా
మీరు చేపినది నిజమే బ్రదర్ నేటి సంఘాములలో మత సాంప్రదాయాలు అనుసరిస్తునారు అబద్ద బోధ బోదిస్తున్నారు
Post a Comment