ఏప్రిల్ 16, 2025 న స్టీవెన్ అయ్యగారు రెండవ సారి. కబూన్ జాషువాకు యోహాను 15:1-8 లో ఉన్న వాక్యాన్ని వివరింరించారు.
యోహాను 15:1-8
కబూన్ ఈ వాక్యం లో తండ్రి, కుమార పరిశుద్ధాత్మ లను గూర్చి చాలా వివరంగా తెలియ చేసారు.
మనం ఆయన పిలుపును అంగీకరించినప్పుడు, మనం క్రీస్తు శరీరంలోనికి అనగా పెండ్లి కుమార్తె సంఘముగా ఆయనతో అంటుకట్ట బడుచున్నాము. యేసు క్రీస్తు అనే ద్రాక్షవల్లి ద్వారా ఆయన లో అంటు కట్ట బడిన తీగలాంటి మన లోనికి పరిశుద్ధాత్మ శక్తి ప్రవహిస్తుంది, ఆయనను వెంబడించే విషయంలో ఎలా మనం నడుచుకోవాలో మనకు నేర్పుతుంది. తండ్రి యొద్ద నుండి యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ మనం దేవుని పోలి ఎలా నడుచు కోవాలో మనకు బోధిస్తుంది.
మనం పరిశుద్ధాత్మ ద్వారా యేసు క్రీస్తు వద్దకు రాకపోతే, తండ్రి అయిన దేవుడు మనల్ని ఆయన లో నుండి తీసి పార వేస్తారు, సాతాను ద్వారా శోధించబడటానికి అనుమతిస్తాడు, యేసు క్రీస్తు ద్వారా తండ్రితో మనం కలిగిఉన్న సంబంధం దినదినం బలపరచాలని తండ్రి యొక్క ఆశ. అయితే మనం యేసుతో సన్నిహిత సంబంధంలోకి రాకపోతే, తండ్రి మనలనను ఆయనలో నుండి తీసి బయట పార వేస్తారు.
యేసు క్రీస్తు నామంలో మనం ఏది అడిగిన మనకు లభిస్తుందని వాక్యం చెబుతోంది. కానీ ఆయన వేరే వాక్యంలో "మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు" అని చెబుతున్నాడు. మనం మన స్వార్థ కోసం కాక తండ్రిని మహిమ పరచుటకు అడిగిన యెడల ఆయన తప్పక అనుగ్రహిస్తారు.
దేవుని వాక్యం చెప్పేది ఏమిటి అంటే " మన స్వార్థ పూరిత కోరికలు అన్నీ దేవుడు ఇవ్వడు".
మొదట మన హృదయాలు స్వచ్ఛంగా పవిత్రంగా ఉంచు కొని దేవుని దయను కోరుకోవాలి. అప్పుడు ఆయన అనుగ్రహం పొందు కుంటాము. మన స్వంత ప్రయోజనాల కోసం కాదు, ఆయన మహిమ కోసం మాత్రమే!
బ్రదర్ స్టీవెన్, అమెరికా
7 comments:
యేసు రాజా నీకు స్తోత్రం. హల్లెలూయ 🙌
మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదకాలి నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పిన యేసయ్య మాట ప్రకారం జీవించాలి Praise the lord Ayyagaru 🙏🏻🙏🏻
దేవుని కృప మీకును పరిచర్యలు తోడై యుండును గాక ఆమేన్ 🙏
టిమేరీ
ఆమేన్ హల్లెలూయ దేవునికి స్తోత్రం. అవును బ్రదర్ గారు దేవుడు నాకు ఆధారం ఆయనే నా బలం 🙏
Blessed Sermon... The Lord Spoken to me
దేవునికి స్తోత్రం బ్రదర్ చక్కటి వాక్యము పంపించినందుకు వందనాలు అలాగే దేవునికి కృతజ్ఞతా స్తుతులు దేవుడు మాట్లాడే దేవుడు కామట్టే మనకి వాక్యము దొరికింది అయితే ఆ వాక్యంలో సారాంశం ఏమిటంటే నిజముగా సత్యమని డోలు కట్టుకుని సిద్ధమని జోడు తోడుకుని ఎవరైతే ప్రభువుని వెంబడిస్తారో వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు అయితే అపవాది కాడ ఎంతో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయినప్పటికీ మన దేవుని విడిచి పెట్టేవాడు కాదు వాడి గద్దించి వాడి మీద మనకు అధికారమిచ్చి వాడిని మన పాదాలకు నుంచి మన పై వారి గురించి దేవునికి కృతజ్ఞత ఆస్తులు ఈ యొక్క పోరాటము నిరంతరము జరుగుతూనే ఉంది ప్రభువు ఆ దినములో ఎంతో ప్రార్ధన చేశాడు మనం కడ అలాంటి ప్రార్థన చేయాలి. పోరాటము యుద్ధము యెహోవాదే నిత్యము పోరాటమే ఈ పోరాటము అనుదినము జరుగుతూనే ఉంటుంది ఈ శరీరంలో రక్త మాంసం నుంచి చెప్పు దేవుని స్తుతించి గోచాడు బ్రతుకులు వాడుకోవాలి ముంది
Post a Comment