మనము కోత కోయు పనివారము
మత్తయి
సువార్త
9:35-38.
35 వ వచనంలో యేసు క్రీస్తు ప్రభువులవారు అన్ని పట్టణాలలో మరియు గ్రామాలలో తిరుగుతూ, వారి సమాజ మందిరాలలో (హీబ్రూ మరియు యూదుల ప్రార్థనా మందిరాలలో) దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు !
యేసు క్రీస్తు ప్రభువులవారు అబ్రహాము ద్వారా ఎంచుకున్న దేవుని ప్రజలైన యూదుల వద్దకు వెళ్ళాడు. వారి పితరులను ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు నడిపించడానికి మోషేను ఎన్నుకొని వారిని వాగ్దాన దేశానికి నడిపించారు. వారు తమ సృష్టికర్తను అనుసరించడానికి మరియు ప్రేమించడానికి దేవుడు మోషేకు పది ఆజ్ఞలను ఇచ్చారు. తరువాత ప్రజలు దేవున్ని ఆరాధించడానికి ఒక దేవుని మందిరం అందులో కొంతమంది మత నాయకులను ఏర్పాటు చేసారు. దేవుడు కొన్ని చట్టాలు, నియమాలు మరియు మార్గదర్శకాలను వారికి యిచ్చి వాటిని అనుసరిస్తూ జీవించాలని కోరు కున్నారు.
యేసు క్రీస్తు ప్రభువులవారు ఒక యూదయ స్త్రీ ద్వారా జన్మించారు. ఆయన తల్లి అయిన మరియ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు యేసయ్యను ఆమె గర్భములో ఉద్భవింప చేసారు. మరియు ఆయనను సంరక్షించే తండ్రిగా యోసేపును ఎన్నుకొని యూదా మత ఆచారాలు, కట్టుబాట్లు సంప్రదాయాలు అనుసరిస్తూ పెంచడానికి దేవుడు నిర్ణయించాడు. ఆయన తల్లి అయిన మరియ, యోసేపు వారిరువులు దావీదు వంశస్థులు. ఈ విధంగా యేసు క్రీస్తు ప్రభువుల వారి గురించి ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలన్నీ నెరవేరాయి.
36 వ వచనంలో, యేసు క్రీస్తు ప్రభువులవారు దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచూ, ప్రతి వ్యాధిని మరియు ప్రతి రోగాన్ని స్వస్థపరచుచూ వారందరూ కాపరి లేని గొర్రెల వలె హింసించబడుతూ నిస్సహాయంగా ఉన్నందున ఆయన ప్రజలపై కరుణ చూపించారు !
యేసు క్రీస్తు ప్రభువులవారు సర్వశక్తిమంతుడు అయిన దేవుడు మరియు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నడిపించ బడుచు, ప్రజలందరి కష్టాలను, బాధలను, అనారోగ్యాలను, సమస్యలను మరియు వారి హృదయ వేదనలు గుర్తించి వాటి నుండి విడుదల అనుగ్రహించేవారు.
ఆయన క్రైస్తవునికి ఇష్టమైన పదాలు అయిన, “నేను మీ కోసం ప్రార్థిస్తాను” అని చెప్పి, ప్రార్థన చేయడం మర్చిపోలేదు! (లేదా ప్రార్థన చేయాలనే ఉద్దేశ్యం లేనివారు కాదు) యేసు ప్రతి రోజు తన తండ్రికి ప్రార్థన విజ్ఞాపన చేస్తూ అవసరతలలో ఉన్న అనేకులను స్వస్థపరచడానికి, ఓదార్చడానికి వారిని పాప బానిసత్వం నుండి విడిపించడానికి తనను నడిపించమని వేడుకున్నారు.
మనం కూడా ప్రజలను యేసు క్రీస్తువలె ప్రేమించి ఆయన వలె ఆదరించాలి. ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు!
అందుచేత 37-38 వచనాలలో యేసు క్రీస్తు ప్రభువులవారు "కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడు కొనుడని తన శిష్యులతో చెప్పెను"
యేసు క్రీస్తు ప్రభువులవారు శిష్యులను "పనివారిని పంపుమని" ఎవరిని అడగమని చెప్తున్నారు ? ఆయనను కాదు! వారు ఆయన తండ్రికి ప్రార్థించాలని యేసు కోరుకుంటున్నారు! అయితే తండ్రి మాత్రమే దేవుడా. యేసు దేవుడు కాదా!
ఆదికాండము 1:1 లో "ఆదియందు దేవుడు" అని వ్రాయబడి ఉంది. ఆదికాండము
1:3,6,9,11,14,20,24,26 ఈ
వచనాలు అన్నింటిలో "దేవుడు" అని వ్రాయబడి ఉంది.
ఆదికాండము 1:2 లో "దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను" అని వ్రాయబడి ఉంది.
ఆదికాండము 1:26 లో "దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము" అని అన్నారు!
ఈ వచనాల్లో ఎక్కడ యేసు క్రీస్తు గురించి ఎందుకు ప్రస్తావించ లేదు? ఏమిటి యేసు క్రీస్తు దేవుడు కాదా? ఈ సృష్టి ప్రారంభంలో దేవుడు మరియు ఆత్మ మాత్రమే ఉన్నారా?
కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం!! యోహాను 1:1-5 "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను"
యోహాను 1:14.లో "ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి" అని సృష్టి ప్రారంభంలో యేసు క్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవునితో మరియు ఆత్మ అయిన దేవునితో కలిసి ఉన్నారని యేసు క్రీస్తు ప్రభువని, దేవుడని, సృష్టికర్త అని తెలియ చేయబడింది.
తండ్రి నుండి వచ్చిన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుల వారు మహిమతోను, కృపతోను సత్యముతోను మరియు పరిశుద్ధాత్మతోను నింపబడ్డారు!
యేసు క్రీస్తు ప్రభువుల వారు సిలువ వేయబడి, మరణాన్ని జయించి సజీవుడై తిరిగి లేచారు. అప్పటికి శిష్యులు ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడలేదు. యేసు క్రీస్తు ప్రభువుల వారు 40 రోజులు 500 మందికి పైగా కనిపించి పరలోకానికి ఆరోహణమైన తరువాత పెంతుకోస్తు దినము వచ్చే వరకు కూడా ఈ పరిశుద్ధాత్మ అనుభవాన్ని శిష్యులు పొందడం జరగలేదు!
ఎఫెసీయులు వ్రాసిన పత్రిక 1:13 లో చెప్పబడినరీతిగా,
"మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి!" పరిశుద్ధాత్మ పొందిన తరువాత మాత్రమే వారు పొందుకున్న రక్షణ పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడుతుంది.
ఎఫెసీయులు వ్రాసిన పత్రిక 1:14 లో "దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు."
యోహాను సువార్త 16: 5-15 వచనాలలో యేసు క్రీస్తు ప్రభువుల వారు తన శిష్యుల తో చెప్పిన మాటలు ప్రకారం విశ్వాసులు అయిన మనం కూడా మన జీవితాల్లో ఈ పరిశుద్ధాత్మ అనుభవాన్ని తప్పక కలిగి ఉండాలి. (పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి ఆహ్వానించి, మన హృదయంలో ఆయన నివసించుట ద్వారా) ఆ పరిశుద్ధాత్మ మన నిమిత్తమై ప్రార్థించుచు యేసు క్రీస్తు ప్రభువుల వారిని మన కొరకు తండ్రి అయిన దేవుని యొద్ద మధ్యవర్తిత్వం చేయమని మనలో ఉన్న పరిశుద్ధాత్మ ప్రార్థించుచున్నారు.
ఎందుకంటే పంట సమృద్ధిగా ఉంది, మనము కోత కోయు పనివారము! మన ప్రభువైన యేసు క్రీస్తు మరియు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని శక్తివంతమైన నాయకత్వంలో పని చేయుటకు ఇంకా అనేక మంది పనివారు మనతో చేరాలని ఆయన ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ పాప విమోచన పొంది ఆయన ఇచ్చే రక్షణను సంపాదించుకొని ఆయన బిడ్డలుగా వారసులుగా జీవించాలని మనం ప్రార్థించాలి!
బ్రదర్ స్టీవెన్, అమెరికా
No comments:
Post a Comment